ఆ లుక్కేంట్రా...? కొడితే అయిపోతావ్... బాలయ్య ఫైర్(వీడియో)

గురువారం, 22 జూన్ 2017 (18:15 IST)
తమ అభిమాన తెరవేల్పులను నేరుగా చూస్తూనే చాలామంది అభిమానులు మైమరిచిపోతుంటారు. తమ హోదాని, స్థాయిని పక్కన పెట్టేసి పాత రోజుల్లో ఆటోగ్రాఫ్‌ల కోసం, ఆ తర్వాత ఫోటోగ్రాఫ్‌ల కోసం, ఇప్పుడు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. తాము తెరపై చూసిన హీరో తమ ఇష్టమైన సినిమాలలో ఉన్నట్టే అంతే ఉదాత్తంగా ఉంటాడని, సినిమాల్లో బడుగులపై, కార్మికులపై చూపే విధంగానే ఎంతో స్నేహాన్ని కనబరుస్తాడని అనుకుని తప్పులో కాలేసి అవమానాలకు గురవుతుంటారు.
 
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే - ఎప్పటిదో తెలియదు కానీ ఓ వీడియో ఇంటర్నెట్‌లో షికారు చేస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనతో ఫోటోలు దిగేందుకు వచ్చిన అభిమానులను కసురుకుంటూ, జడిపిస్తూ, చిర్రుబుర్రులాడుతూనే ఉన్నారు ఆ వీడియోలో. 
 
ఆ లుక్కేంట్రా.. కొడితే ఐపోతావ్ అంటూ ఎవరికో వార్నింగులు కూడా ఇచ్చేసాడు సిని పంథాలో. మీ వాడు కాకపోతే చెప్పండి.. అంటూ ఓ ఆర్డర్ జారీ చేసి, సదరు వ్యక్తులతో మాత్రమే ఫోటోలు దిగిన ఆ తెదేపా ఎమ్మెల్యే వీడియోని మీరూ చూడండి..

వెబ్దునియా పై చదవండి