తొలి చిత్రం 'మృగయా'తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా మిథున్ చక్రవర్తి నిలిచారనీ, ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తర్వాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారని తెలిపారు. ముఖ్యంగా 'డిస్కోడాన్స్'కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారని గుర్తు చేశారు.
మిథున్ చక్రవర్తితో తనకు చిత్రబంధం ఉందనీ, అదెలాగంటే తాను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం 'డిస్కోకింగ్' అని, ఈ చిత్రానికి మిథున్ చక్రవర్తి హిందీ సినిమా 'డిస్కోడాన్సర్' ఆధారమని తెలిపారు. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉందని పేర్కొన్నారు.