సౌందర్య లేదు... ఇప్పుడది ఊహించుకోలేను... బాలకృష్ణ

బుధవారం, 18 జనవరి 2017 (22:47 IST)
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టు నర్తనశాల పట్టాలెక్కిస్తారా...? దీనిపై ఆయన్ను ప్రశ్నిస్తే... "తెలీదు. చెప్పలేను కూడా. ఎందుకంటే కొందరు ఆర్టిస్టులు లేరు. సౌందర్య లేరు. ఆ పాత్రకు వేరేవారిని ఊహించుకుకోలేను. అలాగే భీముడు పాత్రకు శ్రీహరి సరిపోయాడు. పాత్రలను బట్టి ఆహార్యం ఒప్పుకోలుగా కన్పించాలి. నా ఊహకు తగినవారు తగిలితే తప్ప అది మరలా ప్రారంభించలేం" అన్నారు.
 
ఇక తనే దర్శకత్వం వహించాలంటే తనకు తగిన ఆవేశం రావాలన్నారు. దీనిపై మాట్లాడుతూ... ''నాన్నగారు 'కర్ణ' తీశారు. ఆయన తప్ప ఎవ్వరూ చేయలేరు. నా దగ్గరకు వచ్చి కొన్ని కథలు కొందరు చెబుతారు. తర్వాత పూర్తి స్క్రిప్ట్‌ నేను చెప్పేస్తా. అది విన్నాక మీరే దర్శకత్వం చేస్తే బాగుంటుందని చాలామంది అన్నారు. అయితే అలా చేయాలంటే నాలో ఆవేశం రావాలి. వస్తే తప్పకుండా దర్శకత్వం చేస్తా'' అన్నారు.

వెబ్దునియా పై చదవండి