బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ : చిత్ర యూనిట్

మంగళవారం, 11 అక్టోబరు 2022 (16:37 IST)
Zaid Khan, Sonal Montero
బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న చిత్రం బనారస్. జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో నాయికా నాయ‌కులు. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. జయతీర్థ దర్శకత్వం వహించారు.
 
ఈ చిత్రం గురించి జైద్ ఖాన్ మాట్లాడుతూ, మొన్న జరిగిన వైజాగ్ ఈవెంట్ లో మాపై ఎంతో అభిమానం కురిపించారు. ఈ అభిమానం, ప్రేమ నేను ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి వుంటాను. నవంబర్ 4వ  'బనారస్‌'  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'బనారస్‌' మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ. యాక్షన్ కామెడీ థ్రిల్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక వినూత్నమైన ప్రయోగం చేశాం. అది ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా వుంటుంది. చాలా ఫ్రెష్ కంటెంట్ వున్న సినిమా బనారస్. సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సతీష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
 
సోనాల్ మాంటెరో మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోహిస్తున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే పాత్ర ఇది.  సతీష్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. మీ అందరి ప్రేమ, అభిమానం కావాలి'' అని కోరారు.
 
సతీష్ వర్మ మాట్లాడుతూ.. బనారస్ బలమైన కంటెంట్ వున్న చిత్రం. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం.అందరూ థియేటర్ లో సినిమా చూసి ఆదరించాలని కోరారు.  
తారాగణం: జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ  తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు