హాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన తర్వాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. బోల్డుగా మాట్లాడేస్తోంది. హాలీవుడ్ తారలు శృంగారం గురించి దాపరికం లేకుండా మాట్లాడుకున్నట్లే ప్రియాంక కూడా నిర్మొహమాటంగా మాజీ ప్రియుడి దగ్గర నుంచి సెక్స్ వరకు అన్నీ పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ పైనే చర్చిస్తోంది. ప్రియాంక చోప్రా తొలి హాలీవుడ్ మూవీ బేవాచ్ విడుదలైన సందర్భంగా పలు టాక్ షోల్లో పాలుపంచుకుంటోంది.
ఇందులో భాగంగానే ఓ బోల్డ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. శృంగారం గురించి చెప్పుకొచ్చింది. సిగరెట్ తాగడం.. డ్రింక్ చేయడం కంటే శృంగారమే బెటర్ అని చెప్పింది. శృంగారంలో తప్పులేదని చెప్పుకొచ్చింది. సూటిగా కాదు కానీ, ఒక లెదర్ జాకెట్‌ను చూపిస్తూ.. దాన్ని ఒక హీరో ఆమె ఇంట్లో మరిచిపోయాడమే విషయాన్ని ప్రస్తావించారు.
కొన్నాళ్ల క్రితం ఓ బాలీవుడ్ హీరో ప్రియాంక చోప్రా ఇంటికి వచ్చాడట. కొంతసేపు గడిపిన తర్వాత వెళ్లేటప్పుడు అతడు వేసుకుని వచ్చిన లెదర్ జాకెట్‌ను మర్చిపోయాడట. తర్వాత గుర్తుకొచ్చి తిరిగి ఇవ్వాల్సిందిగా ప్రియాంకను అడిగాడట. కానీ ప్రియాంక ఇవ్వలేదట. దాన్ని అతడి గుర్తుగా ఆమె దాచుకుంది. అనేది టాక్ షో నిర్వాహకులు తెలిసిన విషయం.