ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అవకాశాన్ని కైవసం చేసుకుంది. త్వరలో త్రిష నటించిన 96 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వయస్సు పెరిగినా త్రిష గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని.. ఈ సినిమా ట్రైలర్ చూసిన నెటిజన్లంతా కామెంట్లు చేశారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్‌ను ఉద్దేశిస్తూ త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ''నా టైమ్‌లైన్‌లోకి ప్రవేశించి అగౌరవం కలిగించే మాటలు మాట్లాడతావా..? వేరొక యాక్టర్‌ని తిట్టడాన్ని లాయల్టీగా భావిస్తావా..? వేరొకరిని విమర్శించడం హెరాస్ చేయడం పద్ధతేనా..? ఏమనుకుంటున్నావ్... నిన్ను బ్లాక్ చేస్తా'' అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది.