అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

డీవీ

శుక్రవారం, 4 అక్టోబరు 2024 (19:15 IST)
Arjun Sarja, Dhruva Sarja, Uday K Mehta, B. Gopal, Vaibhavi Sandilya
ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
 
అర్జున్ సర్జా మాట్లాడుతూ.. ‘నాకు రామానాయుడు గారిలో చాలా అనుబంధం ఉంది. ఆయన ఒక సారి ఫోన్ చేసి ఓ మంచి డైరెక్టర్‌ను పరిచయం చేస్తాను రమ్మని పిలిచారు. ఆయనే బి. గోపాల్. ఆయనతో కలిసి ప్రతిధ్వని మూవీని చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. మార్టిన్ గురించి చాలా ఖర్చు పెట్టామని చెప్పాల్సిన పని లేదు. టీజర్, ట్రైలర్, పాటలు చూస్తే అందరికీ తెలుస్తుంది. మా చిత్రం అక్టోబర్ 11న రాబోతోంది. దసరాకి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్ని చిత్రాలు చూడండి. మా మూవీని కూడా చూడండి. ధృవ సర్జా ఈ చిత్రానికి చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మళ్లీ కేడీ సినిమా కోసం వెయిట్ తగ్గాడు. నేను పేపర్ మీద కథ రాశాను. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని వచ్చినా.. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. చాలా గ్యాప్ తరువాత ఇలాంటి ఓ కమర్షియల్ చిత్రం రాబోతోందని చెప్పగలను. వైభవి అద్భుతంగా నటించారు. టాప్ టెక్నీషియన్లంతా సినిమాకు పని చేశారు. ఆడియెన్స్ మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
హీరో ధృవ సర్జా మాట్లాడుతూ.. ‘మార్టిన్ టీంకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మామ అర్జున్ గారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. బయట ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. నా ఈ మూవీని చూడండి.. నాకు టాలెంట్ ఉందని అనుకుంటే ఆ తరువాత నా సినిమాలను ఎంకరేజ్ చేయండి. లేదంటే వదిలేయండి. కానీ మీకు సినిమా నచ్చితే అందరికీ చెప్పండి. అన్ని సినిమాలను చూడండి. టైం దొరికితే నా మూవీని కూడా చూడండి’ అని అన్నారు.
 
దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ.. ‘నా మొదటి హీరో అర్జున్ భయ్యా. రామా నాయుడు గారు ఆ సినిమాకు వంద రోజుల ఫంక్షన్ చేశారు. అర్జున్‌ను ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన ఈ సినిమాకు స్టోరీ అందించారు. అర్జున్ అల్లుడు ధృవ నటించిన ఈ మార్టిన్ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
నిర్మాత ఉదయ్ కే మెహతా మాట్లాడుతూ.. ‘మార్టిన్ సినిమాను తెలుగులో చౌదరి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఆయన్ను నమ్మి ఈ చిత్రాన్ని ఆయనకు ఇచ్చాను. అర్జున్ సర్‌ మా వెంట ఉండి నడిపించారు. ధృవ్ సర్జా నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. ఆయన లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు. మార్టిన్ టీంకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
వైభవి శాండిల్య మాట్లాడుతూ.. ‘మార్టిన్ నాకు ఎంతో ప్రత్యేకం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రంలో నేను ప్రీతి అనే పాత్రను పోషించాను. కాబట్టి ఆడియెన్స్ నుంచి నాకు ప్రేమ వస్తుందని అనుకుంటున్నాను. ధృవ్ సర్జాతో నటించడం ఆనందంగా ఉంది. ఇంత మంచి కథను రాసిన అర్జున్ సర్జా గారికి థాంక్స్. అక్టోబర్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు