సూపర్‌స్టార్ మహేష్ బాబు - బ్లాక్‌బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భరత్ అనే నేను సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా.. నేటికీ సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తుండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక తమిళనాట తెలుగు వెర్షన్‌కి అనూహ్యమైన ఆదరణ లభించడం మరో విశేషం.
తెలుగు వెర్షన్ అక్కడ 4.2 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం. తెలుగు వెర్షన్‌లో ఇంతవరకూ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమాతో తమిళనాడులో మహేష్ బాబు క్రేజ్ మరింతగా పెరిగిందనీ, భవిష్యత్తులో అక్కడ ఆయన సినిమాలు ఇతర హీరోల సినిమాలకి గట్టిపోటీ ఇస్తాయనడంలో సందేహం లేదని చెప్పుకుంటున్నారు.
'స్పైడర్'తో గట్టిగా ప్రయత్నించిన మహేష్ బాబు, ఈ సినిమాతో తమిళంలో తన మార్కెట్‌ను పెంచుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోంది. అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి.. మహేష్ కెరీర్‌లో స్పెషల్ మూవీ అయిన ఈ సినిమా ఇంకెలాంటి రికార్డులు సృష్టించనుందో చూడాలి.