ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". పూర్తి రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలను సమకూర్చారు.
ఈ చిత్రంలోని పాటలకు సంబంధించిన ప్రోమోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇందులోభాగంగా, 'భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను' అంటూ సాగే పాటను ఫోన్లలో రింగ్ టోన్స్‌గా పెట్టుకునేందుకు సీఆర్‌బీటీ కోడ్స్‌ను బుధవారం రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ తిలకించండి.