మాలీవుడ్‌లో ఓ నటి కిడ్నాప్ ఘటనను మరిచిపోకముందే.. భోజ్‌పురి ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిపై అత్యాచారం కేసు కలకలం రేపుతోంది. నటుడు తనను రేప్ చేశాడంటూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి చిత్రపరిశ్రమలో పేరున్న మనోజ్ పాండే అనే నటుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ నటి తన ఫిర్యాదులు వెల్లడించింది.
అవకాశాలిస్తానని లొంగదీసుకుని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆరోపించింది. తనలాగానే అవకాశాల కోసం ఎదురుచూసే వర్ధమాన నటీమణుల ముందు తానో పెద్ద స్టార్ అని ఫోజిలిచ్చేవాడని బాధితురాలు తెలిపింది. ఆపై వారితో స్నేహం ఏర్పరుచుకుని అత్యాచారానికి పాల్పడటం మనోజ్ పాండే పని అంటూ ఫిర్యాదులో బాధిత నటి పేర్కొంది.