బిచ్చగాడు హీరోయిన్ సట్నా రెండోసారి పెళ్లి చేసుకుందంటే నమ్ముతారా?

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:10 IST)
బిచ్చగాడు హీరోయిన్ రెండోసారి వివాహం చేసుకుంది. ఇదేంటి? రెండోసారి పెళ్లి చేసుకుందా? అని అనుమానం వస్తుందిగా..? అవునండి నిజమే. బిచ్చగాడు ఫిల్మ్‌ని తమిళనాట రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీక్‌.. గతేడాది సట్నాని సెప్టెంబర్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. పెద్దల అనుమతి లేకుండా వీరి వివాహం రహస్య వివాహం చేసుకున్నారు. ఎలాగోలా ఈ జంట కుటుంబ పెద్దలను ఒప్పించి ఐదునెలల తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్నారు. 
 
బిచ్చగాడుతో గ్లామర్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది సట్నా. అందులో ఆమె యాక్టింగ్‌కు ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ అమ్మడు తాజాగా రెండోసారి మ్యారేజ్ చేసుకుంది. బిచ్చగాడు ఫిల్మ్‌ని తమిళనాట విడుదల చేసిన కార్తీక్‌‌తో రెండోసారి జరిగిన ఈ వివాహ వేడుకకు ఫ్యామిలీ, క్లోజ్‌ఫ్రెండ్స్, సెలబ్రిటీలు హాజరయ్యారు. సట్నా చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు వుండగా, కార్తీక్ కొన్ని సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి