బిగ్ బాస్ నాలుగో సీజన్.. సన్ డే సూపర్‌ సేవ్‌డే.. ఆ ఇద్దరూ సేవ్

సోమవారం, 2 నవంబరు 2020 (09:44 IST)
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సక్సెస్‌ఫుల్‌గా 56ఎపిసోడ్‌లు పూర్చి చేసుకుంది. ఆదివారం నాడు 57వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక సండే కావడంతో ఇళ్లంతా వినోదంతో నిండిపోయింది. అక్కినేని నాగార్జున తిరిగి వారాంతపు షోలో అదరగొట్టారు. 
 
తనను కించపరిచేలా ఇమిటేట్ చేశారని నోయల్ సృష్టించిన సునామీతో అవినాష్, అమ్మా రాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇన్నిరోజులు నోయల్ యాక్ట్ చేశాడని వెళ్తున్న సమయంలో వాడి నిజస్వరూపం బయటపడిందని అమ్మ మండిపడ్డారు. నోయల్‌ చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్‌ను పెంచాయి. టెంపరరీ ఫ్రెండ్‌ అన్నందుకే నన్ను బ్యాడ్‌ చేశాడంటూ అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నోయల్‌ అసలు క్యారెక్టర్‌ బయటపడిందంటూ అమ్మ రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు.
 
ఇక ఇంటి సభ్యులందరినీ పాటలతో గేమ్ ఆడించారు బిగ్‌బాస్. అభిజిత్, అఖిల్‌కు చెరో టీమ్ ఇచ్చి ఓ బజర్‌ ముందు నిలబెట్టాడు. ఆ తర్వాత పాటకు సంబంధించిన మ్యూజిక్‌ను ప్లే చేసి ఆ పాటను గుర్తించి దానికి డ్యాన్స్ చేయాలని రూల్‌ చెప్పాడు. ఈ పోటీలో పాటలను గుర్తించి వాటికి డ్యాన్స్ చేశారు. అయితే అఖిల్, అభిజిత్ టీమ్‌లు రెండూ బాగా ఆడాయని జడ్జిమెంట్ ఇచ్చారు నాగ్.
 
నామినేషన్‌లో ఉన్న మోనాల్‌, అరియానా, అమ్మరాజశేఖర్‌, మోహబూబ్‌లలో ఒకరిని సేవ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. బుట్టలో కొన్ని ఆపిల్స్‌ ఉన్నాయని వాటిని కట్‌ చెస్తే వాటిలో ఎవరి ఫొటో వస్తుందో వారు సేవ్ అవుతారని నాగార్జున ప్రకటించారు. దీంతో అభిజిత్‌ రెండో ఆపిల్‌ కట్‌ చేయగానే మోనాల్‌ ఫోటో వచ్చింది. దీంతో మోనాల్‌ సేవ్‌ అయినట్టు నాగార్జున చెప్పారు.
 
మిమిక్రీ చేసేవాళ్లందరినీ నోయల్ కించపరిచాడంటూ అవినాష్ ఆగ్రహంపై బిగ్‌బాస్‌ క్లారిటీ ఇచ్చారు. మిమిక్రీ ఆర్టిస్టులందరినీ నోయల్ కించపర్చలేదని అవినాష్‌కు చెప్పారు. ఈ విషయాన్ని అమ్మరాజశేఖర్‌కు కూడా చెప్పాలని సూచించారు. నోయల్ వ్యాఖ్యలు, ముఖ్యంగా అవినాష్ రియాక్షన్‌ నేపథ్యంలో ఓ ప్రత్యేక టాస్క్‌ ఇచ్చారు బిగ్‌బాస్. హౌస్‌మేట్స్‌లో ఒక్కొక్కరిని ఇమిటేట్‌ చేసి చూపించాలని సూచించారు నాగార్జున. ఈ గేమ్‌లో అవినాష్‌ తన ట్యాలెంట్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు.
 
ఇక ఆ తర్వాత నామినేషన్స్‌లో ఉన్న అరియానా, మెహబూబ్‌, అమ్మరాజశేఖర్‌లలో ఒకరిని సేవ్ చేసే సమయం వచ్చింది. ఓ ఫజిల్ బోర్డు ద్వారా ఎలిమినేషన్‌ నుంచి అరియానా సేవ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక ఈ వారం కొత్తగా కాలర్‌ ఆఫ్‌ ది వీక్‌ను పరిచయం చేశారు నాగార్జున. బయట ఆడియన్స్‌ నుంచి తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌ నుంచి కాల్‌ వస్తుందని చెప్పారు. ఓ మహిళా అభిమాని అభిజిత్‌కు ఫోన్‌ చేసి ప్రతివారం నామినేట్‌ అవుతుంటే ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించారు. దీనికి అభిజిత్‌ ప్రేక్షకుల దయతో ఇప్పటివరకూ సేవ్‌ అవుతూ వస్తున్నానని, ఓట్లు వేసిన అందరికి రుణపడి ఉంటానని చెప్పాడు.
 
అరియానా సేవ్‌ కావడంతో ఇక మిగిలిన అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌లను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పంపారు నాగ్. ఒక బోర్డుపై మెహబూబ్, రాజశేఖర్ ఫొటోలు పెట్టి ఇంట్లో ఎవరు ఉండాలనుకుంటున్నారో తెలియజేయాలని ఇంటి సభ్యులకు సూచించారు నాగార్జున. దీంతో ఇంట్లో మెహబూబ్ ఉండాలని ఆరుగురు సభ్యులు కోరగా ఇద్దరు మాత్రం రాజశేఖర్ ఉండాలని ఆశపడ్డారు.
 
ఇంటి సభ్యుల ఓట్లతో మెహబూబ్ సేవ్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే అతను ఏడుపు అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను అనుకోలేదని మాస్టర్‌ను పట్టుకుని ఏడ్చాడు. ఆ తరవాత కన్ఫెషన్ రూమ్ నుంచి లివింగ్ రూమ్‌లోకి వచ్చిన మెహబూబ్‌ అక్కడ కూడా ఇంటి సభ్యులను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. తాను సేవ్ అయ్యానని మాస్టర్ ఎలిమినేట్ అయ్యారని చెబుతూ బోరున విలపించాడు. దీంతో ఇంటి సభ్యులంతా షాక్‌కు గురయ్యారు.
 
ఇక మాస్టర్‌ కూడా కంటతడి పెడుతూ కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి లివింగ్‌ రూమ్‌లోకి వచ్చాడు. బట్టలు సర్దుకొని బయటకు బయల్దేరాడు. అప్పుడే నాగార్జున చిన్న ట్విస్ట్‌ ఇచ్చారు. మాస్టర్‌ కూడా సేవ్‌ అయినట్లు ప్రకటించారు. అనారోగ్యం కారణంగా బయటకు వచ్చిన నోయల్‌ కోరిక మేరకు మాస్టర్‌ని సేవ్‌ చేస్తున్నట్లు నాగ్‌ చెప్పారు. అంతేకాదు ఎక్కువ ఓట్లు వచ్చిన కారణంగా వచ్చేవారం కెప్టెన్సీ పోటీకి అమ్మ నేరుగా ఎంపికయ్యారంటూ మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. ఇక మొత్తానికి ఈ సన్‌డే సూపర్‌ సేవ్‌డేగా మిగిలిపోయింది. ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ లేకపోవడంతో ఇంటి సభ్యులంతా ఫుల్ జోష్‌ను నింపుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు