'బిగ్ బాస్-2'లో నిన్నటి నామినేషన్ ప్రకారం పదిసార్లు బెల్ మోగుతుంది. బెల్ మోగిన ప్రతిసారి ఒక్కో హౌస్‌మేట్ మరో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని లోపలికి తీసుకెళ్లి, వారిలో ఒకరిని సేవ్ చేసి, ఇద్దరిని నామినేట్ చేయాలి, ఆయా కారణాలను కూడా వారి ముందే చెప్పాలి.
నూతన్, శ్యామల ఒకసారి ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు. బయటకు వచ్చినప్పుడు నూతన్ నాకు మరో మారు అవకాశం ఇస్తే వాళ్ళందరి అంతు చూస్తా అంటూ సోషల్ మీడియాలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం శ్యామల తనీష్‌తో చెప్పినట్లు నిన్న తేలిపోయింది. నిబద్ధత లేని కారణంగా మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని తనీష్ చెప్పగా కన్నీరు పెట్టుకున్నారు నూతన్. ఇది చూసి తనీష్ కూడా కాస్త ఫీలయ్యాడు.