హారికకు ముద్దిచ్చి వెళ్లిపోయిన సోహైల్.. అందంగా వుంటారని..?

మంగళవారం, 8 డిశెంబరు 2020 (10:19 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో బిగ్ బాస్ ఇచ్చిన అధికారం అనే టాస్క్‌లో రాజుగా సోహైల్ పదవీ సమయం ముగియడంతో ఆ బాద్యతను అభిజీత్‌కు ఇచ్చాడు. మనోడు పెద్దగా ఎంటర్‌టైన్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు.

తను రాజుగా ఉన్నంతకాలం హారిక మాటకు ముందోసారి, చివరోసారి ఇకిలి పికిలి అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించాడు. ఇక మోనాల్ పాటకు సోహైల్, అరియానా రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఏదో సాదాసీదాగా అభిజీత్ రాజు టాస్క్ జరిగింది.
 
ఇక అభిజీత్ రాజు టాస్క్ పూర్తైన తర్వా ఆ అధికారాన్ని హారికకి ఇచ్చాడు. ఈమె అధికారంలో సోహైల్ రచ్చ చేశాడు. హారిక తన చెప్పినవి చేయకపోతే బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తానని ఆదేశించింది. అంత పని చేయోద్దంటూ సోహైల్ హారికకు ముద్దిచ్చి వెళ్లిపోయాడు. దీంతో మంత్రిగా ఉన్న అఖిల్ తనకు ముద్దు పెట్టాలని పదేపదే అడిగిన హారిక కనికరించలేదు. 
 
రాణి కాలం ముగిశాక పెడ్తానని చెప్పి హారిక ఆ సమయానికి తప్పించుకుంది. ఇక రాణి ముందు ప్రత్యక్షం అయిన అభిజీత్ .. మీరు చాలా అందంగా ఉంటారు, డ్రెస్సింగ్ బాగుంది అని చెప్పి లోపలకి వచ్చాక అంతా అబద్దం అని చెప్పడంతో అతని బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది హారిక.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు