ప్రస్తుతం కాజల్ ఎలిమినేషన్ అయ్యాక ఆమె తీసుకున్న పారితోషికంపైన చర్చ సాగుతోంది. కంటెస్టెంట్ స్థాయిని, పాపులారిటీని బట్టి ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం వారానికి ఇంత చొప్పున కంటెస్టెంట్లకు పారితోషికం ఉంటుంది.
సోమవారం నాటి ఎపిసోడ్‌లో శ్రీరామ్, మానస్‌ల ఎమోషనల్ జర్నీని చూపించారు. ఇక నేటి ఎపిసోడ్‌లో షణ్ముఖ్, సన్నీల జర్నీలకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. సన్నీ తన పోస్టర్స్ చూసుకుని ఫుల్ ఫన్ జనరేట్ చేస్తున్నాడు.
బిగ్ బాస్ సన్నీ జర్నీని అద్భుతంగా విశ్లేషించారు. సరదా సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు గుర్తు చేశారు. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా అందరి మొహంపైనవ్వు తీసుకుని వచ్చి ఎంటర్ టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన విజయమే మీకు గుర్తు చేస్తుంది.