బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి గత కొంతకాలంగా సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. నాని కామాంధుడు ఓ అమ్మాయికి నరకం చూపించాడంటూ నానిపై సంచలన కామెంట్స్ చేసింది. కానీ ప్రస్తుతం నాని హోస్ట్ చేసే బిగ్ బాస్-2లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా పాల్గొంటుందని టాక్.
ఈ నేపథ్యంలో, తాజాగా శ్రీరెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించింది. 'నానికి నాకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఏం చేద్దాంరా నాని?' అంటూ ఆమె ట్వీట్ చేసింది. కాగా బిగ్ బాస్‌ను ఉద్దేశించే శ్రీరెడ్డి ఈ కామెంట్ చేసినట్టు అర్థమవుతోందని ఫిలిమ్ నగర్ జనం అనుకుంటున్నారు.