బాలీవుడ్ హాట్ భామ బిపాసా బసు. ఇటీవలే ఓ ఇంటికి కోడలైంది. భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్ళాడిన తర్వాత హానీమూన్ కోసం విహారయాత్రకు వెళ్లింది. ఇండోనేషియాలోని బాలీ సముద్రతీరంలో హానీమూన్ ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా అక్కడి సముద్ర తీరంలో బిపాసా ఎంజాయ్ చేస్తున్న తీరును, దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆమె అప్‌లోడ్ చేస్తున్న ఫొటోలు చూస్తే ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందేనట.
బికినీలో సముద్ర తీరంలో భర్తతో కలిసి బిపాసా వీరవిహారం చేస్తోంది. బికినీలో ఉన్న బిపాసాను చూస్తే.. పెళ్లైన తర్వాత కూడా ఆమె అందాల్లో ఏమాత్రం మార్పులేదనిపిస్తోంది. అంతలా ఆమె అందాలు కనువిందుచేస్తున్నాయి. 37 ఏళ్ల బిపాసా వయసు మీద పడుతున్నా కూడా తనలో హాట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని, తాను సినిమాల్లో నటించకపోయినా అందాల విందుకు ఏ మాత్రం తక్కువ చేయనని అభిమానులకు ఈ ఫొటోలతో చెప్పినట్లుగా ఉంది.