బిపాసా బసు యోగా డే సందర్భంగా చేసిన యోగాకు భారీ పారితోషికాన్ని గుంజేసిందట. రెండు నెలల క్రితం బిపాసా బసు పెళ్లి చేసుకుంది. హనీమాన్ కూడా పూర్తి చేసుకుంది. బెంగళూరులోని కంటీరవ స్టేడియంలో ఓ భారీ యోగ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిపాసా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యంత క్లిష్టమైన యోగ మూమెంట్స్‌ని కూడా అలవోకగా చేసేసింది. అప్పుడే అసలు వివాదం మొదలైంది. దీన్ని నిర్వహించిన ఆర్గనైజర్లు.. ఏకంగా 45 లక్షల రూపాయలకు గవర్నమెంట్‌కి బిల్ కోట్ చేశారు.
ఇక ఈ మొత్తాన్ని చెల్లించబోయేది లేదని, మరింత వివరంగా బిల్స్ ప్రొడ్యూస్ చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది. అయినా సరే.. ఈ మొత్తంలో చాలావరకూ బిపాసాకు చెల్లించేందుకే అడుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ యోగాను ప్రమోట్ చేసేందుకే బిపాసా హాజరైందే కానీ.. భారీ పారితోషికాన్ని బిపాసా బసు డిమాండ్ చేయలేదని.. ఆమె పేరును అనవసరంగా ఇరికించారని ఆమె సన్నిహితులు అంటున్నారు.