స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "పుష్ప'' అనే పేరు పెట్టారు. నిజానికి ఈ చిత్రం ఎపుడో సెట్స్‌పైకి వెళ్లాల్సివుంది. కానీ, కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా చిత్రం షూటింగ్ వాయిదాపడింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో ఈ చిత్రం మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
దీంతో మేకర్స్ విజయ్ సేతుపతి స్థానంలో జాతీయ అవార్డు విజేత బాబీ సింహను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న పుష్పలో రష్మికమందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుండగా.. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ రగ్డ్‌లుక్‌తో ప్రత్యేక గెటప్‌లో కనిపించనున్నారు.