ఇకపోతే మరో వారం పదిరోజుల్లో సినిమా విడుదలనగా ప్రి-రిలీజ్ ఫంక్షన్ అంటూ లక్షల్లో ఖర్చుపెట్టేస్తారు. ఈ దెబ్బతో బయ్యర్లు రయ్యమంటూ చిత్రాన్ని కొనేయాలన్నమాట. ఇన్ని విధాలుగా బఠాణీలు పెడుతుంటే ఎవరు మాత్రం ప్రవోక్ కాకుండా వుంటారు చెప్పండి. ఆఖరికి ఎక్కడో దగ్గర ఉత్సాహం చెంది సినిమాను కొనేస్తారు. లాభాలు వస్తే ఫర్లేదు. కానీ దెబ్బకొడితే మాత్రం 'పోకిరి' పండుగాడి దెబ్బకి గూబ గుయ్యమన్నట్లే.
ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. తాజాగా బాలీవుడ్లో మేడ్ ఇన్ చైనా అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు, మౌనీరాయ్ నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రెయిలర్ లాంఛ్‌కి వెరైటీగా వీళ్లు స్టేజీ పైన బాణలి పెట్టి వంట వండుతూ ట్రెయిలర్ రిలీజ్ చేయడం గమనార్హం. మరి చిత్రం వీరి వండిన వంటకంలా వుంటుందో లేదంటే ఇంటి భోజనంలా వుంటుందో చూడాల్సిందే.