గుండెపోటు కారణంగా రజాక్‌ఖాన్‌ మృతి!

బుధవారం, 1 జూన్ 2016 (18:48 IST)
ప్రముఖ బాలీవుడ్‌ హాస్య నటుడు రజాక్‌ఖాన్‌ మృతిచెందారు. తీవ్రమైన గుండెపోటురావడంతో బుధవారంనాడు కుటుంబ సభ్యులు ముంబైలోని బాంద్రాలోని హోలీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. 
 
షారూఖ్‌ఖాన్‌ సినిమా బాద్‌షాలో మాణిక్‌చంద్‌ పాత్రలో ఆయన మెరిశారు. ఆయన పలు చిత్రాల్లో నటించారు. హలోబ్రదర్‌, జోరు కా గులామ్‌, క్యా కూల్‌ హై తుమ్‌ వంటివి ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.

వెబ్దునియా పై చదవండి