బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ అంటే ఓ సంచలనం. ఆయన తీసే చిత్రాలు ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూనే వుంటాయి. తన కుమార్తెలను సైతం పూర్తి ఎక్స్‌పోజింగ్ చేయిస్తూ సినిమాలు చేసిన దర్శకుడు మహేష్ భట్. ఇక అసలు విషయానికి వస్తే... మహేష్ భట్ గురువారం నాడు 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తెలయిన అలియా భట్, పూజా భట్, షహీన్ భట్ బ్రహ్మాండంగా పార్టీ చేశారు.
అంతా బాగానే వుంది కానీ మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జలేబి చిత్రం హీరోయిన్ రియా చక్రవర్తి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫోటోలు తీవ్ర చర్చనీయాశంగా మారాయి. ఆ ఫోటోలను చూసినవారు షాకింక్ కామెంట్లు పెడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. 70 ఏళ్లలో కూడా మహేష్ భట్ ఇలా హీరోయిన్ ఎదపై వాలిపోయి కనిపించడం ఏంటంటూ మండిపడుతున్నారు.