బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో అఫైర్ విషయంలో గొడవ తర్వాత జావెద్ అక్తర్ తనను, తన సోదరి రంగోలీని తన ఇంటికి పిలిచి దుర్భాషలాడుతూ నేరపూరితంగా బెదిరించాడంటూ ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ 2020లో జావెద్ కోర్టుకెక్కారు. ఆ తర్వాత జావెద్ ఫిర్యాదుపై కంగన కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశారు.