చాలా గ్యాప్ తర్వాత జాగ్వార్ ఆడియో ఫంక్షన్‌లో హాస్యబ్రహ్మ, సీనియర్ నటుడు బ్రహ్మనందం తళుక్కుమన్నారు. సినీ ఛాన్సులు లేకుండా.. సినీ ఫంక్షన్లకు దూరమైన బ్రహ్మానందం ఒక్కసారిగా జాగ్వార్ ఆడియోలో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోనందం మాట్లాడుతూ.. కేటీఆర్ ''తెలంగాణ ముద్దుబిడ్డ" అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో కార్యక్రమానికి హాజరైన సినీ స్టార్స్, సెలబ్రిటీలు, ప్రేక్షకుల చప్పట్లతో సభాప్రాంగణం మార్మోగింది.
సింధూతో ఫోటో దిగాలంటే స్టూలెక్కాల్సొచ్చిందని టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. వీపీ సింధూను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సింధూ అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచమంతటా తెలుసని అన్నారు. భారతదేశం తరపున ఒలింపిక్స్‌లో పతకం సాధించడం మాములు విషయం కాదని చెప్పారు.