హాస్య నటుడు బ్రహ్మానందం హీరోలను ధీటుగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. అలాంటి బ్రహ్మీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీరంగంలో పలువురు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ.. నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో లెక్చరర్. ఈరోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్స్‌లో ఎక్కిన గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. అతని మొహం చూస్తేనే నవ్వు వెల్లివిరిస్తుంది.