RC 17: పుష్ప 3 కు బ్రేక్ - రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్.సి. 17 రెడీ

చిత్రాసేన్

శనివారం, 18 అక్టోబరు 2025 (18:32 IST)
Ram Charan and Sukumar
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటే రంగస్థలం గురించి తెలిసిందే. యాద్రుశ్చికంగా సుకుమార్ శిష్యుడు బుజ్జిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెద్ది. మళ్ళీ అదే సుకుమార్.. రామ్ చరణ్ తో ఆర్.సి. 17 సినిమా చేయబోతున్నాడు. అది కూడా పెద్ది సినిమా షూటింగ్ అయ్యాక వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం కానున్నదని మైత్రీమూవీస్ అధినేత నవీన్ ఎర్నేని ప్రకటించారు. 
 
సోషల్ మీడియాలో అభిమానులు కూడా మళ్ళీ సుకుమార్ తో సినిమా ఎప్పుడెప్పుడా అని ప్రశ్నిస్తున్నారు. కానీ, అల్లు అర్జున్ తో పుష్ప 3 పనిలో సుకుమార్ వున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. ఈ గేప్ లో అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడనేది తెలిసిందే. ఆ సినిమా పాన్ వరల్డ్ ఫార్మెట్ వుండబోతోంది. దానికోసం ప్రపంచంలో పలు లొకేషన్లను రెక్కీ చేశారు కూడా. 
 
ఈ గేప్ లో సుకుమార్ పుష్ప 3 కోసం కథను సిద్ధం చేస్తున్నాడనే టాక్ కూడా వుంది. పుష్ప 2 ఇచ్చిన విజయంతో మూడో భాగానికి సిద్ధం చేస్తానని కూడా ప్రకటించాడు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ కు కథను చేస్తున్నాడని నిర్మాత వెల్లడించారు. అయితే, రామ్ చరణ్ తో పలువురు దర్శకులు కూడా చేయనున్నారనే వార్తలు కూడా ప్రధానంగా వినిపించాయి. నేడు నిర్మాత నవీన్ ఎర్నేని ప్రకటించిన విషయంతో ఓ క్లారిటీ ఇచ్చినట్లయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు