బన్నీ స్నేహారెడ్డి చేయి వదలడా? భార్యంటే బన్నీకి ఎంత ప్రేమో..!!

బుధవారం, 13 జులై 2016 (09:52 IST)
అల్లు అర్జున్ ఈ తరంలో హీరోల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ తన సినిమాల మార్కెట్ విస్తరిస్తూ సౌత్ స్టార్‌గా ఎదగాలనే లక్ష్యంతో బన్నీ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ప్రొఫెషనల్ గానే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తన అనుకున్నది సాకారం చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుని.. ఏ కార్యక్రమానికి హాజరైనా భార్యతో కలసి కనిపిస్తుంటాడు. 
 
అంతేగాకుండా ఎక్కడికెళ్లినా భార్య చేయిపట్టుకుని కనిపిస్తాడు. పెళ్ళైన దగ్గర నుంచి బన్నీ వివిధ కార్యక్రమాల్లో భార్యతో కలిసి హాజరైన ఫోటోలు కనిపిస్తాయి.

భార్యంటే బన్నీకి ప్రేమ ఎక్కువ. స్నేహారెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసిన బన్నీ భార్య చేయి పట్టి ఎలా నడిచాడో, నిజజీవితంలో, దాదాపు ప్రతి సందర్భంలో భార్యతో అదే రీతిలో వ్యవహరిస్తున్నాడు. అందుకే బన్నీకి హ్యాట్రాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు సినీ జనం.

వెబ్దునియా పై చదవండి