ఇటీవలే మోహన్‌బాబు మాట్లాడుతూ, ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని, అస్సలు నిర్మాతల మధ్య ఐక్యత లేదని వెల్లడించారు. దీనిపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్ స్పందించాల్సి వచ్చింది.
ఆయన మాట్లాడుతూ” మంచు మోహన్ బాబు గారి వ్యాఖ్యలను నేను వ్యతిరేకిస్తున్నాను.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు గారు.. నిర్మాతలలో ఐక్యత లేదు అన్నారు. గుర్తుంచుకొని మీరు కూడా ఒక నిర్మాతే.. మీ కొడుకు విష్ణు కూడా ఒక నిర్మాతే.. మీ ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. మా వల్ల కాదు అనుకుంటే మీరు ముందు ఉండి ఈ సమస్యను పరిష్కరించండి.. మీ వెనుకే మేము నిలబడతాం అని తెలిపారు. మరి దీనికి మోహన్‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.