Ram Gopal Varma, Cartoons 90's script
నైన్టీస్లో పుట్టిన వారి అనుభవాలను తెలుపుతూ చేసిన అడ్వెంచర్స్ చిత్రమే "కార్టూన్స్ 90's కిడ్స్ బే ఈడా". దీపాల ఆర్ట్స్ పతాకంపై త్రిగున్, పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష,నటీనటులు గా సాయి తేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి, నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు..పూజా కార్యక్రమాలు అనంతరం నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు.నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచ్ ఆన్ చేయ్యగా.. ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి గారు గౌరవ దర్శకత్వం వహించారు.