దాసరి నారాయణరావు కుమారులపై కేసు.. అప్పు తీసుకెళ్లలేదని..?

శనివారం, 31 జులై 2021 (12:38 IST)
సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కుమారులపై పోలీసులకు కేసు నమోదైంది. దాసరి నారాయణరావు తీసుకున్న అప్పును చెల్లిస్తామని.. చెప్పి ఇప్పుడు ఆయన కుమారులు మొహం చాటేశారని సోమశేఖర్ అనే బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 2012 సంవత్సరంలోనే రెండు కోట్ల పది లక్షల రూపాయలు దాసరి నారాయణరావు అప్పు తీసుకున్నారని ఈ ఫిర్యాదు పేర్కొన్నాడు బాధితుడు సోమశేఖర్.
 
అయితే… 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు మరణం తర్వాత.. పెద్ద మనుషుల సమక్షంలో అప్పు చెల్లిస్తామని ఆయన కుమారులు అరుణ్, ప్రభులు ఇద్దరు మాట ఇచ్చారని బాధితుడు సోమశేఖర్ పోలీసులకు విన్నవించాడు. ఈ నేపథ్యంలోనే.. రెండు కోట్ల పది లక్షలకు బదులు గానూ కోటి 15 లక్షలు ఇస్తామని దాసరి నారాయణరావు కుమారులు అంగీకారం తెలిపారని బాధితుడు చెప్పాడు.
 
ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు సోమశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు