మలయాళ సీనియర్ నటుడిగానే కాకుండా, ఎంపీగానూ, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షుడిగా ఉన్న ఇన్నోసెంట్ మీడియాతో మాట్లాడుతూ మలయాళ చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం లేదని అన్నారు.
గతంలో పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. అలాంటి సంప్రదాయం మలయాళ చిత్రపరిశ్రమలో లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మహిళల పట్ల చెడుగా వ్యవహరిస్తే వెంటనే మీడియాకు తెలిసిపోతుందన్నారు. అయితే ఎవరైనా మహిళలు చెడ్డవారైతే కనుక ఏమీ చేయలేమన్నారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై 'ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్' (డబ్ల్యూసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదన్న విషయాన్ని తాము అంగీకరించమని, పార్వతి, లక్ష్మీరాయ్ వంటి సహచర నటీమణులు బాహాటంగానే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారని ఆ సంస్థ ప్రతినిధులు గుర్తు చేశారు.