చిరంజీవిని బూతులు తిట్టిన నిర్మాత.. నిజ జీవితంలో మెగాస్టార్‌గా బతుకు.. నీతో సినిమా తీసే పాపపు పని చేయను..
బుధవారం, 18 జనవరి 2017 (13:52 IST)
ఖైదీ నెం.150 సినిమా రిలీజ్ అయి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కావడంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మరోవైపు మెగాస్టార్ విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఓ నిర్మాత చిరంజీవిని మీడియా సాక్షిగా బూతులు తిట్టేశాడు. అంతేకాదు..నా సినిమాకు మీడియా ప్రమోషన్ అవసరం లేదు కానీ.. నేను తెలుగు ఇండస్ట్రీలో కొందరు దుర్మార్గులు, దుష్టులను తిడతాను అవి మాత్రం తప్పనిసరిగా ప్రసారం చేయండి... ప్రింట్ చేయండంటూ మీడియాను వేడుకున్నారు ఆ నిర్మాత. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో కాదు.. చదలవాడ శ్రీనివాసరావు.
ఆర్.నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో సమాజానికి అవసరమైన ఎన్నో అంశాలను మేళవించి తీశాను. ఎక్కడా వల్గర్ పదాలు ఉపయోగించలేదని చెప్పారు. ఖైదీ సినిమాకు మాత్రమే థియేటర్లు దొరికాయి. తర్వాత శాతకర్ణి కూడా థియేటర్లను ఆక్రమించాడు. ఇంకో భాగం శతమానం భవతి ఆడుతోంది. దీంతో హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య ప్రదర్శించేందుకు థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. అయినా సినిమాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “అందరూ బావుండాలనుకునేవాడు ఉత్తముడు .., నేను మాత్రం బావుండాలనుకునేవాడూ మంచివాడే.. కానీ నేను మాత్రమే బాగుండాలి. నా చుట్టు పక్కల వారు ఏమైనా పర్లేదు అనుకునేవాడిని ఏమనాలి“ అంటూ ప్రశ్నించారు. హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్యకు మూడు పెద్ద సినిమాల వల్ల థియేటర్లు దొరక్కపోయినా, ఖైదీ కొట్టిన దెబ్బే.. పెద్ద దెబ్బని, అందుకే నిర్మాత మెగాస్టార్ అంటూనే.. పేరు చెప్పకుండా బూతులు తిట్టాడు.
''నా గురించి రాయొద్దని, నా ఫోటో వేయొద్దని మీడియాను చదలవాడ శ్రీనివాసరావు కోరారు. అయితే నేను చెప్పే విషయాన్ని రాయండన్నారు. తన సినిమాలే ఆడాలి. ఇతరుల సినిమాల కలెక్షన్లు కూడా తనకే రావాలనుకోవడం నీచ, నికృష్ట, దరిద్రమైన పని అని ఏకిపారేశారు. మెగాస్టార్ అనేది సినిమాలో ఉండకూడదని, రియల్‌గా మెగాస్టార్ కావాలన్నారు. అయితే మెగాస్టార్‌ని.. రియల్ హీరోను తానేనని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు.
జమ్మూలో షూటింగ్ చేసే పర్మిషన్ ఎవ్వరికీ దక్కదని... తనకే దక్కిందని.. అక్కడికెళ్లి సినిమా తీసుకొచ్చానని చెప్పారు. నిజంగా నైజాంలో ఉన్న థియేటర్ల వారికి హ్యాట్సాఫ్. నైజాంలో 23 థియేటర్లు ఇచ్చారు. ఆంధ్రాలో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. అవమానంగా భావించా. ముఖ్యమంత్రికి కూడా ఇది అవమానకరమేనన్నారు. నైజాం సుదర్శన్ థియేటర్లో కలెక్షన్లు బాగున్నాయని.. ఆంధ్రాలో థియేటర్ దొరకలేదని.. థియేటర్ లేకపోతే కలెక్షన్లు ఎలా వస్తాయి. చిన్న సినిమాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు.
అందుచేత తెరమీద హీరోల్లా కాదు నిజ జీవితంలో హీరోల్లా బతకండి అంటూ చిరంజీవిని ఉద్దేశించి చదలవాడ శ్రీనివాసరావు ఏకిపారేశారు. దేశంలో ఉన్న హీరోలందరితో.. మీతోనూ సినిమా తీసే కెపాసిటీ నాకుంది. అయితే ఆ పాపపు పని నేను చేయను. చిన్న సినిమాలే తీస్తాను. మంచి కథల్నే తీస్తాను అంటూ చదలవాడ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.