తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ, గంగయ్య గారు రాజమండ్రిలో సేవ కార్యక్రమాలు చేసే వారు, ఎం.ఎస్ ప్రసాద్ గారు మంచి మిత్రుడు తను లేకపోవటం తీరని లోటు , సి. శ్రీధర్ రెడ్డి గారు లేకపోవటం తీరని లోటు, కొడాలి అనిత గారు సీరియల్స్ నిర్మించారు తనని కోల్పవటం చాలా బాధాకరమైన విషయం. వీళ్లందరి ఆత్మకు శాంతి చేకూరాలి అని వీళ్ళ ఫ్యామిలీస్ కి నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నానుని తెలిపారు. ప్రొడ్యూసర్ మోహన్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈ నలుగురి ఆత్మకు శాంతి చేకురాలి అలాగే వీళ్లందరి ఫ్యామిలీస్ కి నా సానుభూతి తెలియచేస్తున్నాను.
సి. శ్రీధర్ రెడ్డి గారి కుమార్తె మాట్లాడుతూ నా తండ్రిని కోల్పవటం మా ఫ్యామిలీ కి తీరని లోటు ఇంత క్లిష్ట పరిస్థితులు లో కూడా సంతాప సభ ఏర్పాటు చేయటం గర్వించదగ్గ పరిణామం అలాగే మిగతా ఫ్యామిలీస్ కి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను .
కాజా సూర్య నారాయణ మాట్లాడుతూ, ఈ రోజు ఈ నలుగురు మనతో లేకపోవటం చాలా బాధాకరం, వారి కుటుంబానికి నా సానుభూతి తెలియచేస్తున్నానని తెలిపారు.