చందన్ హీరోగా, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా ప్రేమ బరహా చిత్రం కూడా వచ్చింది. రాధా కళ్యాణ, లక్ష్మీ బారమ్మ వంటి కన్నడ సీరియల్స్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా చందన్ షూటింగ్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు.
సీరియల్‌కు పనిచేస్తున్న ఓ టెక్నిషియన్‌ను నానాబూతులు తిడుతూ నోరుపారేసుకున్నాడు. దీంతో యూనిట్ అంతా తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన మదర్‌ను దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు. అంతేకాదు అతనిపై మాటల దాడికి దిగారు. ఇక అక్కడే ఉన్న మిగతా సిబ్బంది చందన్‌తో చేత టెక్నిషియన్‌కు క్షమాపణలు చెప్పించారు.