చెత్త భారతీయులారా.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి- చాందినికి చేదు అనుభవం

శుక్రవారం, 10 జులై 2020 (19:32 IST)
Chandni Bhagwanani
ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన టీవీ నటి చాందిని భగ్వనాని జాతి వివక్షకు గురైంది. ఆమె తనకు ఎదురైన చేదు అనుభవం అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఆమె మెల్‌బోర్న్ నుంచి ఓ ప్రదేశానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. ఆ బస్సు చాలా దూరం ప్రయాణించిన తరువాత.. తనకు అనుమానం వచ్చి.. ఈ బస్సు సరైన ప్రదేశానికే వెళ్తుందా అని బస్సు డ్రైవర్ అడిగిందని.. అయితే, తన ప్రశ్నకు డ్రైవర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆమె తెలిపింది. మిగిలిన ప్రయాణీకులు కూడా డ్రైవర్‌ను ప్రశ్నించారు. 
 
అందరికీ గౌరవంగా బదులిచ్చిన ఆ బస్సు డ్రైవర్ ‌చాందిని ప్రశ్నకు సమాధానమివ్వలేదు. దీంతో చాందిని మరోసారి అడుగగా ఒక్కసారిగా ఆ డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోయాడని తెలిపింది. చెత్త భారతీయులారా.. ఇక్కడి నుంచి వెళ్లిపోండని బూతులు తిట్టాడని చాందిని వెల్లడించింది. 
 
దీంతో తనకు ఏం చేయాలో తెలియక.. భయపడుతూ.. బస్సు దిగిపోయానని  చాందిని భగ్వనాని చెప్పింది. తనకు జరిగిన ఈ అనుభవమే.. జాతి వివక్ష ఇంకా ఉందనడానికి నిదర్శనం అని చాందిని ఆవేదన వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు