నిర్మాత వి.ఆశ మాట్లాడుతూ... ‘మా దర్శకుడు యోగేష్ ‘చంద్రిక’ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు. సాజిద్ ఖురేషి సమకూర్చిన కథ-స్క్రీన్‌ప్లే, అర్టిస్టుల అభినయం, మా మ్యూజిక్ డైరెక్టర్ గున్వంత్‌సేన్ రీరికార్డింగ్‌తో పాటు గ్రాఫిక్స్ ‘చంద్రిక’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ నెల 25న విడుదల చేస్తున్నాం’ అన్నారు.
గిరీష్ కర్నాడ్, ఎల్.బి.శ్రీరాం, సత్యం రాజేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి - కరుణాకర్ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్.