చార్మి నాజూకైంది.. చీరకట్టులో అదిరిపోయింది.. ఎవరికోసం?

బుధవారం, 11 మే 2016 (15:48 IST)
జ్యోతిలక్ష్మీ.. జ్యోతిలక్ష్మీ.. అంటూ తను నటించిన జ్యోతిలక్ష్మి సినిమాలో డాన్స్‌వేసి.. వేశ్యగా నటించిన చార్మి... ఇప్పుడు గెటప్‌ మార్చింది. చాలా నాజూగ్గా తయారైంది. ఆ సినిమా తర్వాత.. మరలా ఎటువంటి అవకాశాలు అందిపుచ్చుకోని చార్మి.. కొత్త గెటప్‌తో దర్శనమిచ్చింది. పదేపదే తన కట్టుకున్న చీరను సరిచూసుకోవడంతో సమయం సరిపోయింది. 
 
చీరను సరిచేయడానికి కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ వెంటనే తెచ్చుకున్న ఆమె.. ఇలా కొత్త గెటప్‌లో కన్పించడానికి కారణం. చాలా కాలం తర్వాత ఫంక్షన్‌కు హాజరుకావడమే. ఈ గెటప్‌లో కొత్తగా ఉన్న తనకు అవకాశాలు రావచ్చుని భావిస్తున్నట్లుంది. ఇంతకీ ఈమె బయటకు రావడానికి కారణం. జ్యోతిలక్ష్మి.. సినిమా గురించి వివరాలు తెలిపే.. పుస్తకావిష్కరణ జరిగింది. రచయిత మంగళగౌరి రాసిన ఈ పుస్తకం బుధవారంనాడు ప్రసాద్‌ల్యాబ్‌లో ఆవిష్కరించారు. 

వెబ్దునియా పై చదవండి