డెబీనా బెనర్జీ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆరేళ్ల క్రితం తెలుగులో వచ్చిన 'అమ్మాయిలు - అబ్బాయిలు' చిత్రంలో నటించిన హీరోయిన్. ఆ తర్వాత ఈమెకు సినీ అవకాశాలు లేకపోవడంతో ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. అయితే, డబ్బు సంపాదించాలన్న ఆశతో మోసాలకు పాల్పడినట్టు ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
రాజస్థాన్ రాష్ట్రంలోని నొఖా పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అందులో హిందీ సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని తనకు చెప్పిన డెబ్లీనా.. తన నుంచి రూ.11 లక్షల మేరకు మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మోసంలో ఆమె భర్తకు కూడా సంబంధం ఉందని తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు డెబీనా, గుర్మీత్ చౌదరి జంటకు నోటీసులు పంపించారు.
ఇక తనపై కేసు నమోదైన విషయాన్ని తెలుసుకున్న గుర్మీత్, సదరు బాధితుడికి వ్యతిరేకంగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తన పేరును తప్పుగా వాడుకుంటున్నాడని, సదరు వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతనికి, తనకూ మధ్య లావాదేవీలు జరగలేదని ఆమె చెబుతోంది. దీంతో పోలీసులు మాత్రం రెండు కేసులూ నమోదు చేసుకుని విచారణలో నిజాలు తేలుస్తామని అంటున్నారు.