తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను మెగాస్టార్ చిరంజీవి గురువారం పరామర్శించారు. తమిళిసై సౌందర్ రాజన్ తల్లి కృష్ణ కుమారి (80) అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో తమిళిసై సౌందర్ రాజన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదిలావుంటే, కృష్ణ కుమారి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌లో తమిళిసైని పరామర్శించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు స్టాలిన్, రంగస్వామి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించారు.