చిరంజీవి ఖైదీ నంబర్ 150 టీజర్ ఇదే.. మేకింగ్ ఫోటోలతో వీడియో...

సోమవారం, 22 ఆగస్టు 2016 (12:54 IST)
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన 150వ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకు స్టార్‌డమ్ కల్పించిన చిత్రం 'ఖైదీ' పేరు కలిసివచ్చేలా ఈ చిత్రానికి తన 'ఖైదీ నంబర్ 150'గా చిత్రానికి పేరు పెట్టారు.
 
దీంతో మెగాఫ్యాన్స్ ఉత్కంఠకు తెరపడింది. ఖైదీ నెం.150 అని రామ్‌చరణ్ ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఖైదీ సినిమా రేంజ్‌లో ఈ సినిమా కూడా ఉంటుందని అభిమానుల్లో అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. 
 
సోమవారం చిరంజీవి పుట్టినరోజు కావడంతో తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మేకింగ్‌కు సంబంధించిన ఫోటోలతో కూడిన ఓ వీడియోను ఈ చిత్ర నిర్మాత రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్‌లో నీరాజనాలు అందుకుంటోంది. మరికొద్దిసేపట్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

వెబ్దునియా పై చదవండి