అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్ చాలా గ్యాప్ తరువాత ఒక్కక్షణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఈ సినిమా నిన్న విడుదలై హిట్ టాక్‌తో ముందుకు వెళుతోంది. అల్లు శిరీష్ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్నారట. చిరంజీవి ఇంటికి ఎందుకు రమ్మంటున్నారో.. అది కూడా నన్ను మాత్రమే రమ్మంటున్నారు.. ఎందుకో అర్థం కాక అల్లు శిరీష్ భయంభయంగా ఉదయం ఇంటికి వెళ్ళాడట.
అయితే చిరంజీవి అల్లు శిరీష్‌ను గట్టిగా హత్తుకుని బాగా చేశావ్ శిరీష్. నీ నటన చాలా బాగుంది. ఒక్క క్షణం సినిమా కథ కూడా చాలా బాగుంది. భావోద్వేగంతో నటించిన నీ నటన బాగా నచ్చిందంటూ ప్రశంసలతో శిరీష్‌ను ముంచెత్తారట చిరు. దీంతో శిరీష్ ఆనందానికి అవధుల్లేవట. నేరుగా ఇంటికి వెళ్ళిన అల్లు శిరీష్ తన తండ్రి అల్లు అరవింద్‌కు జరిగిన విషయాన్ని చెప్పాడట. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి నన్ను మెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడట.