మెగాఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ "సైరా నరసింహా రెడ్డి". మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎపుడో ప్రారంభమైనప్పటికీ సెట్స్‌పైకి వెళ్లడంలో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి.
ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. చిరు కెరియర్‌లో అత్యంత ప్రతిష్మాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటుంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ భారీ సెట్ వేయగా ఇందులో చిరుతో పాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్టులపై సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం.
స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హీరో రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు సినిమా టీంని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇందులో సంగీత దర్శకుడిగా ఎస్ థమన్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవివర్మన్‌ను తీసుకున్నారు.
ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి వంటివారు ప్రధాన పాత్రలు పోషించనున్న సంగతి తెలిసిందే.