ఫేడౌట్ హీరోయిన్ వద్దబాబాయ్ అంటున్న మెగా ఫ్యాన్స్...

శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:35 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం షూటింగ్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ అంటే ప్రారంభంకానుంది. అంటే ఈ యేడాది డిసెంబర్ నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్లుగా తమన్నా, నిత్యా మీనన్‌ల ఖరారు చేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.
 
ఇటీవలి కాలంలో తమన్నా ఐరెన్ లెగ్‌గా ముద్ర పడిపోయింది. ఈమె చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. దానికితోడు తమన్నా ఫేడ్ఔట్ అవుతోంది. ఈ సమయంలో ఆమెను చిరు 152వ చిత్రంలో ఎంపిక చేయడాన్ని చిరు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 
అయితే, కొరటాల మాత్రం తమన్నా గ్లామర్‌పరంగా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దానికితోడు చిరంజీవికి సరి జోడీగా డాన్స్ వేసి అలరిస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక నిత్యామీనన్‌ను నటన పరంగా ఎంపిక చేయడం జరిగింది. చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రంలో ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్స్ నటించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హీరోయిన్స్ విషయంలో దర్శకుడు కొరటాల పునరాలోచించాల్సిందిగా మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. 
 
ఇకపోతే, చిరంజీవి ప్రస్తుతం 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సైరా చిత్రం విడుదలకు ముందే చిరు 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభంకానుంది. చిరంజీవి కోసం కొరటాల శివ ఒక పవర్‌ఫుల్ స్టోరీని తయారు చేసే పనిలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు