కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. దీంతో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఈయన లాక్డౌన్ సమయంలో అపుడపుడూ పాకశాస్త్ర నిపుణుడి అవతారమెత్తుతున్నాడు. తాజాగా చిత్త తొక్కుతో చిన్న చేపల గుజ్జు అనే వంటకాన్ని తయారు చేసి, తన తల్లి అంజనాదేవికి వడ్డించారు. పైగా, తాను చేసిన వంటను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.