బాలీవుడ్‌ను పాతికేళ్లకు పైగా ఏలుతున్న ఖాన్‌ల త్రయానికి వయసు మీద పడుతోందా.. ఆ మాటంటే వాళ్లు ఒప్పుకోరు కానీ, కుర్రహీరోయిన్లు వాళ్లను దూరం పెడుతున్న సూచనలు కనబడుతున్నాయి మరి. ఖాన్ త్రయం కలెక్షన్లు నేటికీ బాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్నప్పటికీ ఈ సీనియర్ హీరోల సరసన నటిస్తే సీనియర్ హీరోయిన్ అనే ముధ్ర పడిపోతుందని కుర్ర హీరోయిన్‌లు భయపడిపోతున్నారని సమాచారం. అందుకే ముసలి ఖాన్‌ల సినిమాల్లో నటించడానికి ఏదో ఒక సాకు చూపి వీళ్లు తప్పించుకుంటన్నారని తెలుస్తోంది.
ఇలా బాలీవుడ్ కుర్ర హీరోయిన్ల తిరస్కరణకు గురైనవ్యక్తి మామూలోడు కాదు. షారుక్ ఖాన్. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సరసన సినిమా అంటే ఎవరైనా కాదంటారా ఎగిరి గంతేస్తారు కదా. కానీ, ఆలియా భట్ మాత్రం ‘ఊహూ.. కుదరదు’ అని చెప్పేశారట. ‘అమ్మ ఆలియా.. నీకు అంతుందా’ అని బాలీవుడ్‌బుగ్గలు నొక్కుకుంటోంది.
ఇంతకీ షారుక్‌తో సినిమాని ఈ బ్యూటీ ఎందుకు కాదన్నారు కారణం ఉందట. డేట్స్ లేవని సాకు చెప్పారు. అందుకే వినయంగా ‘సారీ... డేట్స్ లేవు’ అన్నారట. అయినా కొందరు నమ్మడం లేదు. సీనియర్ హీరో సరసన నటిస్తే.. సీనియర్ హీరోయిన్ అనే ముద్రపడిపోతుందని ఆలియా భయపడిందని, అందుకే డేట్స్ లేవని చెప్పి, ఎస్కేప్ అయిందని చెప్పుకుంటున్నారు. నిజమేంటో ఆలియాకే ఎరుక! కాగా, ఆలియా నో చెప్పడంతో అనుష్కా శర్మను ఓకే చేశారని బాలీవుడ్ టాక్.