పవన్‌కు మద్దతుగా ఎ.పి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరై సంఘీ భావం తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ, 40 ఏళ్ళుగా నేను చూస్తున్నా. అధికార పార్టీ, ప్రతి పక్షనాయకులు మీటింగ్‌కు వస్తే ఎదురు పడకుండా జాగ్రత్తగా పోలీసులు తమ డ్యూటీ చేస్తారు. కానీ నేడు అది జరగలేదు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్థించారు. పవన్ కారును అడ్డుకున్న ఓ పోలీసు అధికారి రాక్షసానందం చూపారు. అంతేకాకుండా రాత్రి పూట కారులో ప్రయాణిస్తుంటే లైట్లన్నీ తీసేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నన్ను ఇబ్బంది పెట్టిన తీరును చూసి ఎ.పి. తెలంగాణకు చెందిన పలువురు నాయకులు మద్దతు పలికారు. చంద్రబాబునాయుడు సంఘీభావంతెలిపారు. సి.పి.ఎం.., సి.పి.ఐ., బిజెపితో సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా! ఢిల్లీ వెళ్ళి అక్కడ తిరుపతి లడ్డులు ఇచ్చి వస్తారు. ఇక్కడ బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తారు. ఇక కామన్ మాన్ పరిస్థితి ఏమిటి? అందుకే ఎ.పి.లో ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అని పిలుపునిచ్చారు.