ప్రధాని మోడీ నోబెల్ ప్రైజ్‌కు అర్హులు - ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాలి!

సోమవారం, 17 అక్టోబరు 2022 (12:28 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు సెటైర్లు వేశారు. ప్రధాని మోడీగారు ఆస్కార్ అవార్డుకు అర్హులంటూ కామెంట్స్ చేశారు. ఆస్కార్ కాకపోయినా ఆయన భాస్కర అవార్డు ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ సోమవారం మీడియాతో నానాటికీ పతనమైపోతున్న రూపాయి విలువపై స్పందించారు.
 
గతంలో రూపాయి విలువ పతనంపై అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగం మామూలుగా లేదన్నారు. ఆయన హావభావాలు, నటనకుగాను ఆయనకు తాను అవార్డుకు నామినేట్ చేస్తున్నానని చెప్పారు. ప్రధాని మోడీని విశ్వగురువుగా, నోబెల్ కంటే గొప్ప వ్యక్తిగా భావించే బీజేపీ శ్రేణులకు ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. 
 
మోడీగారు నోబెల్ ప్రైజుకు అర్హులై అయితే ఏ కేటగిరీలో ఇస్తే బాగుంటుందని ప్రశ్నిస్తూ ఆయన ఆప్షన్లు ఇచ్చారు. 
 
* వైద్య విభాగంలో నోబెల్ - కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నందుకు
* ఆర్థిక శాస్త్రంలో నోబెల్ - పెద్ద నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల నుంచి నల్ల ధనాన్ని వెనక్కి రప్పించడం.
* నోబెల్ శాంతి పురస్కారం - రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 6 గంటల పాటు ఆపినందుకు 
* భౌతిక శాస్త్రంలో నోబెల్ - రాడార్ థియరీకి అంటూ కేటీఆర్ ట్వీట్స్ చేశారు. 
 
కోవిడ్ వ్యాక్సిన్‌ను కనుక్కున్నందుకు మెడిసిన్‌ లేదా సైన్స్‌లో ప్రధాని మోడీకి నోబెల్ ప్రైజ్‌ను డిమాండ్ చేస్తున్నామన్నారు. మోడీ మంత్రివర్గ సహచరులంతా మేధావులనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నాని ముఖ్యంగా కిషన్ రెడ్డి అని సైటైర్ వేశారు. "మన దేశంలో ప్రధాని మోడీ ధైర్యం చేసి వ్యాక్సిన్ కనుక్కున్నారు" అంటూ ఇటీవల కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

 

Let us demand Nobel prize in Medicine/Science to Modi Ji

Apparently Modi discovered the Covid Vaccine courageously

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు