మజిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ, కలర్‌ఫోటో లాంటి చిత్రాల్లో నటించిన సుహాస్ తాజాగా ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఈరోజు విడుదలచేసింది చిత్రయూనిట్. సుహాస్ హీరోగా మెహెర్ తేజ్ దర్శకుడుగా పరిచయమవుతూ తేజా కాసరపు తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఫ్యామలి డ్రామా. ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్ మరియు నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లు నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్టోరి, స్క్రీన్ ప్లే ని మెహెర్ తేజ్ మరియు షణ్ముఖ ప్రసాంత్ లు అందిస్తున్నారు.