తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ అంటే.. కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో లారెన్స్‌కు అభిమానం ఎక్కువ. ఆయన సినిమాలంటే పడి చస్తే లారెన్స్.. ప్రస్తుతం రజనీకాంత్ పోలీసు గెటప్‌లో నటించిన ''మూన్‌డ్రు ముగమ్'' సీక్వెల్ హక్కులను పొందారు. రజనీ హీరోగా 1982లో విడుదలైన ఈ సినిమాలో రజనీ మూడు గెటప్పులో కనిపించారు. ఈ సినిమా రీమేక్‌లో రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటించనున్నారు.
ఈ సందర్భంగా లారెన్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీ కాంత్ సినిమాను రీమేక్ చేయబోతున్నానని, ఎస్. కథిరేసన్‌తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు లారెన్స్ చెప్పాడు. నటీనటుల ఎంపిక జరుగుతోందని.. ఆ రాఘవేంద్రస్వామి దయవల్లే ఈ చిత్రం రీమేక్ హక్కులు తనకు దక్కినట్లు వెల్లడించాడు. ఈ సినిమా హక్కుల విషయంపై రజీనీకాంత్ సార్‌కు చెప్పానని..ఆయన కూడా హ్యాపీగా ఫీలయ్యారని.. తనను ఆశీర్వదించారని చెప్పుకొచ్చాడు.