‘తెలంగాణ దేవుడు’కూ క‌రోనా ఎఫెక్ట్‌

మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (18:52 IST)
Telagana producers
తెలంగాణాను సాధించిన తెలంగాణ దేవుడు అనే పేరుతో కె.సి.ఆర్‌. బ‌యోపిక్ రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 23న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ, కె.సి.ఆర్‌.కు క‌రోనా సోక‌డంతో ఆయ‌న రెస్ట్ తీసుకుంటున్నారు. ఇందుకు సినిమాను తీసిన నిర్మాత‌లు కూడా త‌మ దేవుడికి క‌రోనా సోకింద‌నీ, ప్ర‌జ‌లుకూడా క‌రోనా బారిన ప‌డుతున్నార‌ని క‌నుక సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారంనాడు ప్ర‌క‌టించారు.
 
వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉద్యమనాయకుడి పాత్రలో ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం కరోనా ఉదృతిని దృష్టిలో పెట్టుకుని, ప్రజల శ్రేయస్సును కోరుతూ.. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో చిత్రయూనిట్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. 
 
మాక్స్‌ల్యాబ్ సిఈఓ మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, దయచేసి ఎవరూ అశ్రద్ధగా ఉండకండి. మేము తెలంగాణ దేవుడుగా భావించే సీఎం కేసీఆర్‌గారికి కూడా కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని మా చిత్రయూనిట్‌ తరుపున కోరుకుంటున్నాము. ప్రజలెందరో ఇప్పుడు కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సినిమాని విడుదల చేయడం ఏమంత శ్రేయస్కరం కాదని భావిస్తూ.. మా నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాని ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తాం" అని అన్నారు.
 
ఇష్క్` విడుద‌ల వాయిదా‌
 
దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ  ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ఇష్క్‌`.   ఏప్రిల్‌23న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు త‌గిన మార్గ నిర్దేశకాలు విడుద‌ల‌చేశాయి. అందులో భాగంగా ఏపీలో 50శాతానికి  థియేట‌ర్ల ఆక్యుపెన్సి త‌గ్గించ‌డం, తెలంగాణ‌లో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించ‌డం జ‌రిగింది. ఇలాంటి టైమ్‌లో సినిమా రిలీజ్‌ చేయ‌డం కరెక్ట్ కాద‌ని భావించి ఈ నెల 23న విడుద‌ల‌కావాల్సిన `ఇష్క్` చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. ప‌రిస్థితుల‌న్నీ అనుకూలించిన తర్వాత క్రొత్త విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం అన్నారు
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు